రూ.2 వేల నోటు మార్పిడికి శనివారం తుది గడువు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. ఏ బ్యాంకులోనైనా మార్చుకోకపోతే అది కాగితం మాత్రమే అవుతుందని తాజాగా స్పష్టం చేసింది. రూ.2 వేల నోట్ల మార్పిడికి చివరి తేదీని సెప్టెంబర్ 30గా గతంలో ప్రకటించింది. రూ.2 వేల నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు 93 శాతం నోట్లు బ్యాంకుల వద్దకు చేరాయి. మరో 7 శాతం నోట్లు ఇంకా ప్రజల వద్దనే ఉన్నాయి.