మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నోటీసులు అందించారు. ఈనెల 4న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. వాట్సాప్ ద్వారా నారాయణకు సీఐడీ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే నారా లోకేష్‌కు ఢిల్లీలో సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్ కేసులో.. ఈ ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉంది. అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తులో వెలుగు చూసింది. ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది ఏపీ సీఐడీ. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. అలాగే నారా లోకేష్‌ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా సీఐడీ చేర్చింది.