ఈ ఏడాది దసరా పండుగను ఏ తేదీన జరుపుకోవాలి అనే విషయంపై క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 23వ తేదీన దసరా పండుగ జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. 100 మంది సిద్ధాంతులు ధర్మశాస్త్రానుసారం చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శృంగేరీ జగద్గురువులతో పాటు కంచికామకోటి, పుష్పగిరి పీఠాధిపతులు కూడా 23వ తేదీని ఆమోదించారని వివరించింది. కాగా, పలు క్యాలెండర్లలో అక్టోబర్ 24న దసరా అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa