కవిటి మండలంలోని కొత్త పుట్టుక గ్రామంలో మంగళవారం ఎంపీపీ కడియాల పద్మ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య భద్రత కోసం ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేని పథకాన్ని సీఎం జగన్ చేపట్టారన్నారు. అనంతరం గర్భిణీ, బాలింతలకు జగనన్న సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa