ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బుధవారం నాడు చీమకుర్తిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.