టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐదుగురు టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌యాత్ర చేపట్టనున్నారు. రణస్థలం మండలం నారువ పంచాయతీ మాజీ సర్పంచ్ ఎన్.రామ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్.గణేష్, శిల్లా రామసూరి, ఎన్.సుందరరావు, ఎన్.ఆదినారాయణ సోమవారం రణస్థలంలో సైకిల్‌యాత్ర ప్రారంభించారు. మంగళవారం కోటబొమ్మాళి, సరుబుజ్జిలి మీదుగా సైకిల్‌యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబుకు మద్దతుగా అమరావతి వరకు సైకిల్‌యాత్ర చేపడుతున్నామని తెలి పారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. వైసీపీ అరాచకాలపై అవగాహన కల్పిస్తామన్నారు.