అనంతపురం జిల్లా, కంబదూరు పట్టణంలో విషాదం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... తిమ్మారెడ్డి, కుసుమ దంపతుల రెండో కుమారుడు పార్థసాయి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా అతడు పాఠశాలకు వెళ్లాడని తల్లిదండ్రులు భావించారు. అయితే పాఠశాల వదిలిన కూడా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఉన్న ఓ గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానకు ఉరివేసుకుని వేలాడుతూ పార్థసాయి కనిపించాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa