ఏపీ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చింది. రూ.వెయ్యి కోట్లను 11ఏళ్లకు గానూ 7.60% వడ్డీతో జగన్ ప్రభుత్వం ఈ అప్పు తీసుకుంది. మరో రూ.వెయ్యి కోట్లను 18ఏళ్లకు 7.50% వడ్డీతో కేంద్ర ప్రభుత్వం వద్ద రుణం తీసుకుంది. FRBM కింద రూ.43,500 కోట్లకు ఏపీ సర్కార్ తెచ్చిన అప్పు చేరింది. కార్పొరేషన్ ద్వారా మరో రూ.23 వేల కోట్ల అప్పు తీసుకుంది. 7 నెలల్లోనే రూ.66,500 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం తెచ్చి రికార్డ్ సాధించింది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.