పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలోగత రెండు రోజులగా తిష్ట వేసిన జంట ఏనుగులు ఎట్టకేలకు బుధవారం ఉదయానికి అడవిలోకి చేరుకున్నట్లు పశ్చిమ విభాగం ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీదేవి తెలిపారు. మండలంలోని పాలెం పంచాయితీ సరిహద్దులో రెండు రోజులుగా జంట ఏనుగులు తిష్ట వేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈస్ట్, వెస్ట్ ఫారెస్ట్ అధికారులు జంట ఏనుగులను తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.