మహానటి రోజా కార్చిన కన్నీరంతా డ్రామా.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులే అన్నారు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. అసెంబ్లీ సాక్షిగా తన గురించి రోజా అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారని..మంత్రి రోజా ఎన్నిసార్లు అసభ్య పదజాలం వాడారో అందరికీ తెలుసని.. ఇవాళ నీతులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలన్నారు. తెలుగు దేశం పార్టీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడితే కేసులు ఉండవా?.. తాము చేసిన ఫిర్యాదులపై ఇంతవరకు విచారణ జరగలేదన్నారు.
తన గురించి రోజా చాలా నీచంగా మాట్లాడారని.. అంత కన్నా నీచంగా బండారు మాట్లాడారా అన్నారు. తాను ఎన్నో కేసులు పెట్టినా పోలీసులు స్పందించలేదని.. ఇపుడు చీటికీ మాటికి తపై కేసులు పెడుతున్నారన్నారు. మంత్రి రోజా తన పాత వీడియోలు ఒకసారి చూడాలని.. అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో తెలుస్తుందన్నారు. రోజాకు మహిళను అన్న సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందా.. రాష్ట్రంలో ఆడ పిల్లలు మాన ప్రాణాలు పోతున్నా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు రోజా మద్యం బాటిల్స్ బద్దలు కొట్టారని.. ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బ్రాహ్మణికి జడలుకు వేశానని చెప్పిన రోజా.. ఇప్పుడు విమర్శలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.
నారా భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్నపుడు.. రోజా నవ్విన నవ్వు తాము ఎప్పుడూ మర్చిపోము అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు స్వీట్లు పంచుకుంటావా.. తనకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అన్న సంగతి మర్చిపోకూడదన్నారు. చంద్రబాబును కామ సీఎం అని రోజా మాట్లాడలేదా?.. భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ మీద అవాకులు చెవాకులు పేలలేదా అన్నారు. రోజాతో పాటు అధికార పార్టీ వాళ్ల గురించి మాట్లాడితే.. తమ ఇంటికి పోలీసులు వస్తారన్నారు. కానీ వాళ్ళు మాట్లాడితే నో పోలీస్ అన్నారు.
గత అసెంబ్లీలో రోజా వెకిలి చేష్టలు, వికృత చేష్టల్ని ప్రజలంతా గమనించారన్నారు. అప్పటి మంత్రి పీతల సుజాత బాడీ షేమింగ్‌పై చట్ట సభలలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో రోజా మరచిపోయారా అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి ఎలాంటి అసభ్యకరమైన పదజాలంతో రోజా మాట్లాడారో గుర్తు లేదా అనిప్రశ్నించారు. ఇప్పుడు తన వరకు రాగానే ఏడుస్తున్నారని.. ఏడుపులు రోజా నాలుగేళ్ల క్రితమే తమను ఏడిపించిందన్నారు.
మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసిన ఆయన్ను అరెస్ట్ చేయగా.. కోర్టు పూచీకత్తుపై విడుదల చేసింది. అయితే ఈ కామెంట్స్‌పై మంత్రి రోజా స్పందించారు.. టీడీపీ నేతల తీరును తప్పుబడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు.