రైల్వే శాఖ ప్రయాణికుల్ని అలర్ట్ చేసింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైళ్ల కొత్త టైం టేబుల్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. 64 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటుగా మరో 70 ఇతర రైళ్ల సేవలను చేర్చారు. వివిధ నగరాల మధ్య అనుసంధానాన్ని పెంచడంతో పాటుగా ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్‌ను రూపొందించినట్లు రైల్వేశాఖ తెలిపింది. 90 రైళ్ల గమ్యస్థానాలను మార్చారు.. అలాగే 12 రైళ్లు నడిచే రోజులను పెంచారు. 22 రైళ్లను సూపర్ఫాస్ట్లుగా నడుపుతున్నారు.. దీంతో రాకపోకల సమయాలను ప్రయాణికులు ముందుగా సరిచూసుకోవాలని సూచించింది. రైల్వే అధికారిక వెబ్సైట్లోనూ ఈ వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు అధికారులు. వివరాల కోసం క్లిక్ చేయండి
రైల్వేశాఖ విడుదల చేసిన జాబితాలో ఏపీ మీదుగా నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. ఆ వివరాలను కూడా రైల్వేశాఖ వెబ్సైట్లో పొందపరిచింది. గత నెలలోనే ఏపీ మీదుగా నడిచే రెండు వందేభారత్ రైళ్లు కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రెండు రైళ్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రయాణికులు ఈ కొత్త టైం టేబుల్‌ను గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని స్టేషన్లలో కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టైం టేబుల్లో కూడా వచ్చేసింది.