ఏపీలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటమే కాకుండా..ఉపరితల ద్రోణి కూడా వ్యాపించి ఉండటంతో వానలు పడుతున్నాయంటున్నారు. ఇవాళ ( బుధవారం) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. అలాగే రైతులు, గొర్రెల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బాపట్ల, పార్వతీపురం మన్యం, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వాన పడింది. అంతేకాదు రెండు రోజులుగా ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతుడంగా.. ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. గతవారం రాష్ట్రంలో వానలు పడితే.. ఈ వారం మాత్రం వాతావరణ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ విచిత్ర వాతావరణంతో జనాలు కూడా ఇబ్బందిపడుతున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. తెలంగాణలోని సంగారెడ్డి, మంచిర్యాల, అదిలాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు కురుస్తాయంటున్నారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వనలు కురుస్తాయంటున్నారు.