ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ షాక్,,,,విచారణకు హాజరుకావాలని సమన్లు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 09:46 PM

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని రణ్‌బీర్ కపూర్‌కు ఇచ్చిన సమన్లలో తెలిపింది. ఇప్పటికే మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో జరిగిన మోసాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల నమోదైన కేసుల ఆధారంగా కూపీ లాగిన ఈడీ అధికారులు.. పలువుర్ని ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. మరోవైపు.. ఈ మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణానికి సంబంధించి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఇటీవల తీవ్ర ఊహాగానాలు రాగా.. ఈ క్రమంలోనే రణ్‌బీర్ కపూర్‌కు సమన్లు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలు, ఆ బెట్టింగ్ యాప్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా వైజాగ్‌లో 10 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ కేసుకు సంబంధించి ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ సంస్థకు చెందిన రూ. 417 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.


అయితే ఈ మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని వైపులా దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు రణ్‌బీర్ కపూర్‌ను విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. ఈ మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ ద్వారా రూ. వేల కోట్లు మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ కంపెనీకి చెందిన ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ వెబ్‌సైట్లు అన్నింటికి సంబంధించి బెట్టింగ్ వేసే సిండికేట్ యాప్ ఈ మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌. దీని సెంట్రల్ హెడ్ ఆఫీస్ దుబాయ్‌లో ఉందని.. అక్కడి నుంచే మొత్తం ఆదేశాలు వస్తాయని ఈడీ విచారణలో తేలింది. కొత్తగా బెట్టింగ్ పెట్టవారిని ఆకర్షించేందుకు బెట్టింగ్ వెబ్‌సైట్‌లకు సంబంధించిన యాడ్‌లను ప్రమోట్ చేసేందుకు మన దేశంలో ఈ మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ భారీగా డబ్బును ఖర్చు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa