గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డులోని వాల్మీకి నగర్ సమీపంలోని హిందూ స్మశాన వాటికను గురువారం మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గురప్ప యాదవ్ పరిశీలించారు. గత నెల ఆ వార్డు కౌన్సిలర్ ఉదడల ప్రభాకర్ కౌన్సిల్ సమావేశంలో స్మశాన వాటిక దుస్థితిపై ప్రస్తావించారు. దీంతో కమిషనర్, ఇంజనీరు పరిశీలించి మురుగునీరు, పిచ్చి మొక్కలు తొలగించాలని, అమావాస్య లోపే పనులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.