శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న అంకురార్పణ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలకంగా భావించే గరుడ సేవ ఈ నెల 19న జరగనుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa