గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు ప్రాంతానికి చెందిన ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణములోని అనాధ, పేదలకు దుస్తులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకురాలు చింతల రత్నకుమారి పాల్గొని సుమారు 30 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తనకున్న దాంట్లో మానవతా దృక్పథంతో ఏడాదిలో పలుమార్లు పేదలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.