పిడుగురాళ్ల పట్టణంలోని ఆదర్శ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఈ ప్రాంతంలో 15 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ నివాసాలకు సరైన గుర్తింపులేక ఇబ్బందులు పడుతున్న ఆదర్శకాలనీ వాసులకు తమప్రభుత్వం 800 ఇళ్ళ పట్టాల పంపిణీ చేస్తోందని చెప్పారు. ఇళ్ల పట్టాలు ఉంటే ఇంకా ఎవరూ ఖాళీ చేయించలేరని భరోసా వారికి ఇచ్చారు.