కాకుమాను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 11న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపిడిఓ పి. రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిడిఓ మాట్లాడుతూ గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, రానున్న కాలంలో చేపట్టవలసిన కార్యాచరణ చర్చించనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొనవలసిందిగా కోరారు.