ఢిల్లీలో ఈనెల 9, 10, 11 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి ఇన్ స్పైర్ మనక్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పది మంది విద్యార్థులు ఎంపికైనట్లు డీఈవో పి. శైలజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నుంచి 35 మంది విద్యార్థులు ఎంపిక కాగా వీరిలో పది మంది ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎంపిక కావడం అభినందనీయమన్నారు.