నరసరావుపేట పట్టణంలోని వెంకట రెడ్డినగర్ కు చెందిన 16 సంవత్సరాల బాలిక సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు వారించారు. దీంతో ఆమె ఈ నెల 6వ తేదీన ఇంటినుంచి వెళ్ళిపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లేదని ఆదివారం బాలిక బాబాయి రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.