ఇజ్రాయెల్- హమాస్ దాడుల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో నెలకొన్న వివాదాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. భీకర దాడుల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 3 డాలర్లకు పైగా పెరిగాయి. ఈ క్రమంలో మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా భారత్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు.