ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో బీజేపీకి వీడ్కోలు ప్రకటించినట్లు అయిందని విమర్శించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందని, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.