తమిళనాడు అరియలూరు సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో సోమవారం పెను విషాదం జరిగింది. వెట్రియూర్ గ్రామంలో దేశీ బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలతో సహా 10 మంది చనిపోయారు. పేలుడు ధాటికి 9 బైక్లు, టెంపో వ్యాన్ కూడా దగ్ధం అయ్యాయి. ఇక బాణసంచా ఫ్యాక్టరీ యజమానులు పరారీలో ఉండడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.