పఠాన్‌కోట్ దాడిలో సూత్రధారి షాహిద్ లతీఫ్ మంగళవారం మృతి చెందాడు. గుర్తుతెలియని సాయుధులు పాకిస్థాన్‌లోని సియోల్కోట్లో షాహిద్ ని కాల్చిచంపారని స్థానిక పత్రికలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యుడైన 41ఏళ్ల షాహిద్‌పై భారత్‌లో పలు కేసులున్నాయి. 12 నవంబరు 1994లో ఉపాచట్టం కింద అరెస్టయిన అతడు 16 ఏళ్లపాటు జైలు జీవితం గడిపాడు. జనవరి 2, 2016లో పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో షాహిద్ కీలక పాత్ర పోషించాడు.