పొదిలిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా విషయం అందరికీ తెలిసిందే. నేతపాలెంకాలనీలో చందాలు వేసుకొని, దాతల సహాయంతో ఏర్పాటు చేసుకున్న బోరును మంగళవారం మార్కాపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేతపాలెంకాలనీలో రెండు సంవత్సరాలకుపైగా మరమ్మతులకు గురైన బోరును నాయకులు, సంబంధిత అధికారులు పట్టించుకోలేదన్నారు. సమస్యను గుర్తించి తీర్చాల్సిన నాయకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారన్నారు.