కేంద్ర ప్రభుత్వ బృందం పరుచూరు నియోజకవర్గం చినగంజాం లో బుధవారం సాయంత్రం పర్యటించనుంది. జిల్లాలో నిర్వహించే కార్యక్రమాలు, ఎగుమతులపై క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతారు. కేంద్ర బృందంతో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పర్యటిస్తారు. కేంద్ర బృందానికి వివరించేందుకు మండల స్థాయి అధికారులు అన్ని శాఖల నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. చీరాల ఆర్ డి ఓ సరోజిని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.