ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పెరిదేపి గ్రామ టీడీపీ నాయకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రిలే దీక్షలో స్వామి పాల్గొని మాట్లాడారు. ఆలకూరపాడు రోడ్డులోని దైవారాదన కేంద్రం చర్చిలో ప్రార్థనలు జరిపారు.