టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మీడియాతో మాట్లాడుతూ..... చంద్రబాబు రోజూ తాగే వాటర్ బాటిళ్లను కూడా లెక్కిస్తున్నాం. ప్రతి కదలికా సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఆయన జైలుకు వచ్చినపుడు 66 కిలోల బరువు ఉన్నారు. తర్వాత 68.7 కిలోలు, గురువారం 67 కిలోల బరువు ఉన్నారు. చంద్రబాబుకు ఇది వరకే ఉన్న చర్మ సమస్య, ఉష్ణోగ్రతల తీవ్రత, చెమటవల్ల దద్దుర్లు వచ్చి ఉండొచ్చు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా చానెళ్లలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన హైప్రొఫైల్ ఖైదీ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భద్రతపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. రెండురోజుల క్రితం డీహైడ్రేషన్ వచ్చిందని ఆయన చెప్పారు. ఓఆర్‌ఎస్ ఇచ్చాం. లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వాలని మా డాక్టర్లు సూచించారు. బాడీపై ర్యాషెష్ ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. డెర్మటాలజిస్ట్ మందులు ఇచ్చారు. గురువారం కూడా దద్దుర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో సెకండ్ ఒపీనియన్ కోసం జీజీహెచ్ డాక్టర్లను పంపించాలని కోరాం. వాళ్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసి కొన్ని సూచనలతో పాటు మందులు రాసిచ్చారు. బయట భయపడుతున్నంత సీరియ్‌సగా లేదు అని తెలిపారు.