రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణంగా అక్టోబరులో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. ఈ సమయంలో ఎండలు పెరిగి వేసవి మాదిరి వాతావరణం నెలకొంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల ప్రభావాన్ని ‘అక్టోబరు హీటింగ్’గా అభివర్ణించారు. నైరుతి నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాలు వచ్చే సమయంలో గాలుల దిశ మారుతుందని చెప్పారు.