రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్తు చార్జీల పెంపును నిరసిస్తూ ఆదివారం గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, ట్రావెలర్స్ బంగళా, కసాపురం రోడ్డు ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. విద్యుత్తు చార్జీలు పెంపుకు వ్యతిరేకంగా ప్రజలు సంతకాలు చేశారు. ఈనెల16వ తేదీన డిఎఇ ఆఫీసు వద్ద చేపట్టనున్న నిరసనను జయప్రదం చేయాలని నాయకులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa