రానున్న ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యూకే వైయస్ఆర్ సీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ లో వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా సమావేశం దిగ్విజయంగా సాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైయస్ఆర్ సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో- ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి , APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్ , APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. UK నలుమూలల నుంచి 450 మందికి పైగా వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa