టోకు, రైటైల్ వ్యాపారులతో పాటు ప్రాసెసర్లు తమ వద్దనున్న చక్కెర నిల్వల వివరాలను వారం వారం వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని గత సెప్టెంబర్ 23న ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలువురు హోల్‌సెల్, రిటైలర్లు, లార్జ్ రిటైర్ షుగర్ ట్రేడర్లు ఇంతవరకూ షుగర్ మేనేజిమెంట్ సిస్టంలో రిజిస్టర్ చేసుకోకపోవడాన్ని ఆహార మంత్రిత్వ శాఖ గుర్తించింది. కొన్ని సంస్థల వద్ద పెద్ద మొత్తంలో నివేదించని చక్కెర నిల్వలు ఉన్నట్టు డైరక్టరేట్ ఆఫ్ షుగర్ అండ్ వెజిటెబుల్ ఆయిల్ ఇటీవల గుర్తించిందని ఆహార శాఖ తెలిపింది. చక్కరె నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయకపోవడం రెగ్యులేటర్ సిస్టమ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. తక్షణమే వీరంతా షుగర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. అక్టోబర్ 17 తర్వాత జరిమానాలు, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.