ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం త్రీటౌన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగస్వామి నగర్‌కు చెందిన రాజేశ్(31) డిగ్రీ పూర్తి చేశాడు. నగరంలోని సప్తగిరి కూడలిలో ఉన్న ఓ బ్యాంకులో కారు లోన్లు ఇప్పించే సెక్షనులో పనిచేసేవాడు. పై చదువులు చదువుకుని ఉంటే మంచి ఉద్యోగం వచ్చేదని తరచూ బాధపడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa