ఈ నెల 20న మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సీఎం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది.. మూలా నక్షత్రం రోజు అమ్మవారిని లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నాం అన్నారు. దానికి తగినట్లు అదనపు కౌంటర్లు, తాగు నీరు, ప్రసాదాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్నదానం ఏర్పాట్లు పరిశీలించాను.. భక్తులు ఎంతో అద్భుతమైన ప్రసాదం అందించారని చెప్పారు. సామాన్య భక్తుడిలా నేను కూడా భోజనం చేశా.. రైస్, ఇతర పదార్ధాలు క్వాలిటీ గా అందిస్తున్నారని వెల్లడించారు. మంత్రిగా కాకుండా భక్తుడిగా నేను ప్రసాదాన్ని తీసుకుంటున్నా.. భక్తులకు అందించే పదార్ధాల క్వాలిటీ తగ్గదని స్పష్టం చేశారు. భక్తులందరూ అన్న ప్రసాదం స్వీకరించాలని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు .