పేద ప్రజలకు బాసటగా ప్రజా వైద్యం అందిస్తున్నామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. కరజాడ, శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని గొంటి వీధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తరఫున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపొందించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహించనున్నామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులయితే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తారని, ఈ మొత్తం ప్రక్రియను ఉచితంగానే అందిస్తున్నామని అన్నారు.