పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. మార్గదర్శి షేర్ హోల్డర్ జీజేరెడ్డి కుటుంబాన్ని రామోజీరావు బెదిరించి షేర్లు బదిలీ చేయించుకున్నాడు. చంద్రబాబు, రామోజీ ఎంత నీచమైన మనుషులో నిరూపితమైందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రామోజీ ఎదుగుదలకు కారణమైన జీజేరెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి. కానీ, జీజేరెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా వీళ్ల నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.