ఉద్యోగుల గ్రీవెన్స్ కి సకాలంలో పరిష్కరించాలని డిఆర్ఓ గాయత్రీ దేవి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో డిఆర్ఓ ఉద్యోగుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ 19 అర్జీలను స్వీకరించారు.