భారత్‌లోకి 70 మంది ఉగ్రవాదులు నకిలీ పాస్‌పోర్టులతో అక్రమంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది. నేపాల్ నుంచి వారు దేశంలోకి ప్రవేశించినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాకిస్తాన్ సీక్రెట్ సర్వీస్ సంస్థ ISIకు లేదా బంగ్లాదేశ్‌లోని జమ్మాత్ ఉల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారై ఉంటారని గుర్తించారు. దీంతో దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం నిఘా బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.