భారత్‌కు చెందిన ఓ వ్యక్తి.. తరచూ విదేశాలకు వెళ్లేవాడు. అయితే స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలో ఓ మహిళ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ గత కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే పలు మార్లు.. ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లిన ఆ వ్యక్తి.. ఈసారి ఆమెనే భారత్‌కు రప్పించాడు. ఆ తర్వాతే అత్యంత కిరాతకంగా హత్య చేసి తనకేమీ తెలియనట్లు పారిపోయాడు. మహిళ మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు దర్యాప్తు జరపగా.. నిందితుడు దొరికాడు. అతడ్ని అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు కూపీ లాగుతున్నారు.
ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ మహిళ అత్యంత దారుణమైన స్థితిలో హత్యకు గురైంది. వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ కేసులో గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన కారణాలను రాబడుతున్నారు. లీనా బెర్గర్ అనే 30 ఏళ్ల మహిళ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలోని ఓ బ్యాగులో గుర్తించారు.
గురుప్రీత్ సింగ్‌కు.. స్విట్జర్లాండ్‌లో పరిచమైన లీనా బెర్గర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ రిలేషన్‌షిప్ ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే గురుప్రీత్ సింగ్ తరచూ స్విట్జర్లాండ్‌కు వెళ్లి లీనాను కలుసుకునేవాడు. అయితే ఇటీవల ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అనుమానం పెంచుకున్నాడు. అయితే ఆమెపై కోపంతో ఈసారి లీనా బెర్గర్‌ను భారత్ రావాలని కోరాడు. పక్కా ప్లాన్ ప్రకారం లీనాను ఈనెల 11 వ తేదీన ఢిల్లీకి రప్పించాడు. లీనా వచ్చిన తర్వాత బాగానే ఉన్న గురుప్రీత్ సింగ్.. అంతకుముందే మరో మహిళ పేరు, సర్టిఫికేట్లతో ఓ కారును కూడా కొనుగోలు చేశాడు.
ఐదు రోజుల తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఇనుప చైన్లతో చేతులు, కాళ్లు కట్టేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ముందుగా కొన్న కారులో లీనా బెర్గర్ మృతదేహాన్ని కారులో ఉంచాడు. అయితే కారులో ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో గురుప్రీత్ సింగ్ అప్రమత్తమయ్యాడు. లీనా మృతదేహాన్ని బ్యాగులో పెట్టి రోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. స్థానికులు దుర్వాసన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయగా.. ముందుగా కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి నిందితుడు గురుప్రీత్ సింగ్‌ను గుర్తించారు. అతని ఇంట్లో రూ. 2.25 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.