ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబరు 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర.. రూట్ మ్యాప్ విడుదల చేసిన వైవీ, బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 03:21 PM

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందన అధికార వైఎస్సార్సీపీ ఈ నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో వీటి గురించి వివరించేందుకు సామాజిక సాధికారిత బస్సు యాత్రను చేపట్టింది. అక్టోబరు చివరి నుంచి డిసెంబరు 31 వరకూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో మూడు దశల్లో ఈ యాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో తొలిదశ యాత్ర అక్టోబరు 26న ఇచ్ఛాపురంలో ప్రారంభం కానున్నందని వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు.


ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నర ఏళ్లుగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, ప్రజలకు ఏ రకమైన పథకాలు అందాయనే విషయాన్ని బస్సు యాత్ర ద్వారా వివరించనున్నామని అన్నారు. మొదటి దశ యాత్ర 12 రోజుల పాటు జరగనుండగా.. యాత్ర ప్రారంభమయ్యే ఇచ్చాపురంలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 27న గజపతినగరం, 28న భీమిలీ, 30న పాడేరు, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న పలాస, 4న శృంగవరపుకోట, 6న గాజువాక, 7న ఆముదాలవలస, 8న సాలూరు, 9న అనకాపల్లితో తొలి దశ సామాజిక బస్సు యాత్ర ముగియనుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.


దీపావళి పండుగ తర్వాత రెండో దశ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. దళితులు, గిరిజనుల కోసం సీఎం జగన్ చేపట్టినన్ని కార్యక్రమాలు గతంలో ఎవ్వరూ కూడ చేయలేదన్నారు. మంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ.. ముడు ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందని, మొదట దశ అక్టోబరు 26న మొదలై.. నవంబరు 9 ముగియనుందన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలు ముందుకు వెళ్తున్నారని, నాలుగున్నర ఏళ్లలో ఏమీ సాదించామో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి గర్వపడుతున్నామని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక పథకమైన ఉందా? అని బొత్స విమర్శించారు. ప్రతి పక్షాలు చేస్తున్న కుట్రలు ప్రజలకు వివరిస్తామని, రాష్ట్రానికి మరోసారి జగన్ సీఎం కావల్సిన అవశ్యకత ఉందని ఉద్ఘాటించారు. ‘మేనిఫెస్టో అమలు అనేది సీఎం జగన్ పేటెంట్.. 98 శాతానికి పైగా హామీలు అమలు చేశారు.. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒకటైన అమలు చేశారా.. రుణమాఫీ అమలు చేశారా..? మద్యాన్ని దశలు వారీగా నియత్రిస్తున్నాం.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తున్నాం’ అని బొత్స స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa