చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్ప.. ఆధారాలు ఎక్కడున్నాయి ఇప్పటికైనా చెప్పాలని మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు. కక్ష పూరిత రాజకీయాలు రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. చంద్రబాబుని 50 రోజులు జైల్లో పెట్టి ఏం సాధించారని చింతా మోహన్ పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారులు ఇండియన్ పొలిటికల్ సర్వీసులో ప్రారంభించినట్టుందన్నారు.కోర్టుల పైన కూడా ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. కోర్టులో బీజేపీ ప్రమేయం ఉందన్నారు. జడ్జిమెంట్ ఢిల్లీలో తయారవుతున్నాయన్నారు. ప్రజలకు కోర్టులపై నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టాయన్నారు. రాష్ట్రంలో ఈ రోజు మార్పు వచ్చిందని.. చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చింతా మోహన్ అన్నారు.