టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా కరపత్రాల ద్వారా గ్రామస్థాయి వరకూ తీసుకెళ్లే విధంగా టీడీపీ నేతలు ‘బాబుతో నేను’ అనే కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు, వర్షాభావ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలపై క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ సంయుక్తంగా ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడిగా ఉద్యమం చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది.