ఎమ్మెల్యేల అనర్హతపై డిసెంబర్ 31లోపు నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు పవిత్రతను పాటించాలని స్పీకర్‌కు సూచించింది.