యూపీలోని నోయిడాలో దారుణం జరిగింది. భరత్, సీమాదేవి భార్యాభర్తలు. సీమాదేవితో వారి ఇంటి పక్కనే ఉండే కాంట్రాక్టర్ శశిశర్మ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వేరే ఇంటికి మారినా వీరి ఎఫైర్ కొనసాగింది. దీంతో భార్య, ఓ ఫ్రెండ్‌తో కలిసి శశిశర్మ ఇంటికి ఇటీవల భరత్ వెళ్లాడు. గొడవ జరగ్గా శశిశర్మను వారు గొంతు కోసి చంపేశారు. నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.