టీడీపీ చీఫ్ చంద్రబాబుకు నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా ఇతర కేసుల్లో అరెస్టు చేస్తారనే ఆందోళన టీడీపీ అభిమానుల్లో నెలకొంది. CBNకు అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చింది. స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. వీటిని క్వాష్ చేస్తే 17-A వర్తించే ఏ కేసులోనూ CBNను అరెస్టు చేసే అవకాశం ఉండదు. అయితే గవర్నర్ అనుమతి తీసుకుని కొత్త కేసులు పెడితే అరెస్టు చేయొచ్చు.