స్నానం చేసి ఇంటికి వెళ్తున్న షెడ్యూల్ కులానికి చెందిన ఇద్దరు యువకులను దారుణంగా కొట్టి వారిపై మూత్రం పోశారు. ఈ ఘటన తమిళనాడులోని పాలాయంకొట్టైలో జరిగింది. ఇద్దరు దళితులను మద్యం తాగిన ఆరుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. వారి బట్టలు విప్పించి వారిపై మూత్ర విసర్జన చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు. నిందితులు తిరుమలైకొజున్తపూర్కు చెందిన పొన్నుమని, నల్లముత్తు, అయిరాం, రామర్, శివ, లక్ష్మణన్గా గుర్తించారు.