తిరుమలలో మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ రూల్స్ అతిక్రమించారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్ స్టెయిన్ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు.దీంతో స్టెయిన్ పట్ల అక్కడి భక్తులు అసహనం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉంది.