2024లో భారత ఉద్యోగుల జీతాలు పెరగనున్నట్లు 'డబ్ల్యుటీడబ్ల్యు శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్' వెల్లడించింది. వచ్చే ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధిక జీతాల పెంపు (9.8%) భారత్ లోనే ఉండబోతోందని ఈ నివేదికలో తెలిపారు. 2024లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, సేల్స్, టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్, ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రీసోర్స్ విభాగాల్లో ఉద్యోగాలు, జీతాలు పెరగనున్నాయని పేర్కొంది.