ఇండోనేషియాలోని తైమూర్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం తైమూర్ దీవులకు సమీపంలోని కుపాంగ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కుపాంగ్‌కు 21 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.