మహారాష్ట్రలోని ప్రధాన పర్యాటక ప్రాంతంలో ఒకటైన మాథేరాన్‌ను సందర్శించేందుకు ఏర్పాటుచేసిన టాయ్‌ట్రైన్ నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. వర్షాకాలం నేపథ్యంలో సుమారు నాలుగు నెలలుగా ఈ ట్రైన్ సేవలు నిలిచిపోయాయి. నవంబరు 4వ తేదీ శనివారం నుంచి ఈ ట్రైన్ ప్రారంభించేందుకు సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నేరుల్-మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ రెండేసి చొప్పున మొత్తం నాలుగు సర్వీసులు నడపనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa